AP Deputy Speaker : కోలగట్ల వీరభద్ర స్వామి షాకింగ్ కామెంట్స్..మా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది..
Speaker : తమ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ కోలగట్ల వీరభద్ర స్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు. తొందరలోనే ఏపీలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఆయన చేసిన కామెట్స్ తీవ్ర దుమారం రేపాయి.
తమ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ కోలగట్ల వీరభద్ర స్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు. తొందరలోనే ఏపీలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఆయన చేసిన కామెట్స్ తీవ్ర దుమారం రేపాయి.
ఉద్యోగులు వైసీపీకి ఓటేయరని మనలో చాలా మంది అనుకుంటున్నారని, వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నవారు కేవలం 15 శాతం మాత్రమేనని వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. అశోక్ గజపతిరాజు, తాను పోటీ చేస్తే అశోక్ గెలుస్తారని చాలా మంది అంటున్నారని, మరి స్ధానిక సంస్ధల ఎన్నికల్లో అశోక్ ప్రచారం చేసినపుడు టీడీపీ ఎందుకు ఓడిపోయిందో ఆలోచించాలని ఆసక్తికరంగా వ్యాఖ్యానించినట్లు సమాచారం. అశోక్ రోడ్డు మీదకొస్తే ఎన్నికలొచ్చినట్టు తెలుస్తుందన్నారు. తాను జనంలోకి వెళ్తే సంక్షేమ పనులు గుర్తొస్తాయని వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజలు ఆకర్షితులుగా ఉన్నారన్నారు. పట్టభద్రులు కూడా అండగా నిలిచి సుధాకర్ ను గెలిపించాలని కోరారు. రాష్ట్రాన్ని పారిశ్రామికపరంగా రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారన్నారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు ద్వారా కోట్లాది రూపాయలు పెట్టుబడులు రాబోతున్నాయన్నారు. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు.