కర్నూలు: పంట కోత ప్రయోగాల ఫలితాల ద్వారా పంట దిగుబడి అంచనా వేయొచ్చని ముఖ్య ప్రణాళిక అధికారి వేణుగోపాల్ తెలిపారు. జూపాడు బంగ్లా మండలంలో శనివారం పంట కోత ప్రయోగాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 5×5 మీటర్ల ప్లాట్లో పంట కోత ప్రయోగం చేయడం ద్వారా వచ్చిన ఫలితాల ఆధారంగా రికార్డులు నమోదు చేస్తారన్నారు.