కర్నూలు: విజయనగరంలో ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు జరుగనున్న ఏఐఎస్ఎఫ్ 49వ రాష్ట్ర మహాసభలకు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.శరత్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం దేవనకొండ మండల తహశీల్దార్ కార్యాలయంలో మహాసభల కరపత్రాలను విడుదల చేశారు.