TG: గత BRS ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలకు విసిగివేసారిన ప్రజలు కాంగ్రెస్‌కి పట్టం కట్టారని CPM నేతలు అన్నారు. కానీ కాంగ్రెస్ కూడా BRS బాటలోనే నడుస్తుందని తెలిపారు. కళలకు, క్రీడలకు, కమ్యూనిస్టు భావజాలంకు డోర్నకల్ పుట్టినిల్లని అభివర్ణించారు. ఈ పాలకులు అరెస్టులు చేయించడం, జైలుకు పంపించడం, పేదలపై దాడులు చేయడం జరిగిందన్నారు. సీఎంని ఈ విషయమై నాలుగు సార్లు కలిసి కేసులు రద్దు చేయాలని కోరి ఏడాది అయ్యిందని గుర్తు చేశారు.