AP: భూకబ్జాలపై పులివెందుల టీడీపీ ఇంఛార్జ్ బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘గత YCP ప్రభుత్వంలో పులివెందులలో యథేచ్ఛగా భూకబ్జాలు జరిగాయి. YS అవినాశ్ రెడ్డి కుటుంబ సభ్యులు తొండూరు మండలంలో 200 ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమించి సాగు చేశారు. ప్రభుత్వ భూమిని ఎకరా రూ.50 వేలకు కొన్నట్లు రిజిస్టర్ చేశారు. దీనిపై విచారణ జరిపితే MROలు, రిజిస్ట్రార్లు ఇంటికి పోతారు. భూ ఆక్రమణలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.