VZM: జిల్లాలో నేరాలను నియంత్రించుటలో భాగంగా జిల్లా వ్యాప్తంగా నేరాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను ముందుగా గుర్తించి, ఆయా ప్రాంతాలపై నిఘా పెట్టేందుకు డ్రోన్స్ని వినియోగిస్తున్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈవ్ టీజింగ్స్, చైన్ స్నాచింగ్స్ నియంత్రించుటకు ఇకపై డ్రోన్స్ వినియోగిస్తామని ఎస్పీ తెలిపారు.