AP: తన సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతిపట్ల సీఎం చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ‘తమ్ముడు రామ్మూర్తినాయుడు నన్ను విడిచి వెళ్లిపోయాడు. బాధతప్త హృదయంతో అందరికీ తెలియజేస్తున్నా. ప్రజాజీవితంలో పరిపూర్ణ మనసుతో ప్రజలకు సేవలు చేశాడు. మా నుంచి దూరపై కుటుంబంలో ఎంతో విషాదం నింపాడు. తమ్ముడి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా’ అని ఆవేదనకు గురయ్యారు.