అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లాగే ప్రధాని మోదీకి మతి పోయినట్టుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. అమెరికా అధ్యక్షుడిలా మోదీ జ్ఞాపక శక్తి కోల్పోయాడన్నారు. గతంలో బైడెన్.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని రష్యా ప్రెసిడెంట్ పుతిన్ అంటూ సంబోధించారని గుర్తు చేశారు. రాజ్యాంగం కేవలం బీజేపీ, RSS కార్యకర్తలకు మాత్రమే ఖాళీగా కనపడుతోందని.. కాంగ్రెస్ రాజ్యాంగానికి డీఎన్ఏ లాంటిదని అభివర్ణించారు.