కర్నూలు: ఆత్మకూరులోని మండల పరిషత్ కార్యాలయంలో ఈనెల 18న గిరిజన సమస్యలపై దరఖాస్తులను స్వీకరించనున్నట్లు శ్రీశైలం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు ఆఫీసర్ వెంకట శివప్రసాద్ తెలిపారు. ఈ ఆత్మకూరులో ఆయన మాట్లాడుతూ.. 18న జరిగే గిరిజన సమస్యలపై దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో తమకు ఫిర్యాదులను అందజేసినట్లయితే వాటి పరిష్కారానికి చొరవ తీసుకుంటామని తెలిపారు.