VZM: జిల్లాలో ఎన్నికల కోడ్ రద్దు అయిన కారణంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం నుండి యధావిధిగా కొనసాగుతుందని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ శ్రీనివాసమూర్తి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. అర్జీ దారులు, జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.