AP: సీఎం చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తినాయుడు ఆరోగ్య పరిస్థతి విషమించి మరణించిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ‘చిన్నాన్న రామ్మూర్తి నాయుడు మృతి తీవ్ర విషాదం నింపింది. చిన్నాన్నతో చిన్నప్పటి అనుబంధం కళ్లముందు కదులుతోంది. పిన్ని, తమ్ముళ్లు ధైర్యంగా ఉండాలని కోరుతున్నా’ అని పేర్కొన్నారు.