TG: హైదరాబాద్ మెట్రో రైల్ సెకండ్ ఫేజ్‌లో ముందడుగు పడుతోంది. ఓల్డ్ సిటీ మెట్రో రైల్ భూసేకరణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. MGBS – చాంద్రాయణగుట్ట వరకు చేపడుతున్న 7.5 కిలోమీటర్ల మెట్రో మార్గానికి కావాల్సిన భూసేకరణకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ రోజు ఆస్తుల సేకరణ డిక్లరేషన్‌కు కలెక్టర్ అనుదీప్ దురిషెట్టి ఆమోదం తెలిపారు. దీంతో కొత్త సంవత్సరం జనవరిలో మెట్రో రైలు పనులు ప్రారంభం కానున్నాయి.