బ్రిటన్ విశ్వవిద్యాలయాల్లో భారత విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. యూకేలో ఆర్థిక సంక్షోభం, భారతీయ విద్యార్థులకు పరిమిత ఉద్యోగావకాశాలు, అల్లర్లు, వీసా నిబంధనలు కఠినతరం చేయడం వల్ల భారత విద్యార్థులు.. అక్కడి విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసుకోవట్లేదని.. పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. విద్యార్థుల సంఖ్య దాదాపు 20.4 శాతం తగ్గినట్లుగా ఆఫీస్ ఫర్ స్టూడెంట్స్ సంస్థ తాజాగా విడుదల చేసిన సర్వేలో వెల్లడించింది.