కోనసీమ: పి.గన్నవరం మండలంలోని ఊడిమూడి లంక వద్ద చేపడుతున్న గోదావరి వంతెన నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. ఆయన అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. పి.గన్నవరం నియోజకవర్గంలో గోదావరి నదీ కోత నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. అప్పనపల్లి, అయినవిల్లిలలో కాజ్వేల నిర్మాణం చేపట్టాలన్నారు.