వేడి నీటితో తలస్నానం చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. వేడి నీరు జుట్టు కుదుళ్లలో ఉన్న సహజ నూనెలను తొలగిస్తుందని, దీంతో జుట్టు పొడిబారి పెళుసుగా మారుతుందని అంటున్నారు. స్కాల్ఫ్ను పొడిగా చేస్తుందని, దురద, చుండ్రు వంటి సమస్యలకు దారి తీస్తుందని చెబుతున్నారు. జుట్టు మూలాలను బలహీనపరుస్తుందని, ఫలితంగా జుట్టు చిట్లిపోయి రాలిపోతుందని పేర్కొంటున్నారు. అందుకే గోరువెచ్చని నీటితో తలస్నానం చేయడం మంచిదని సూచిస్తున్నారు.