AP: సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టేవారికి శిక్షపడేలా చేయాలని ఎమ్మెల్యే గౌతు శిరీష అసెంబ్లీలో ప్రస్తావించారు. అధికారంలో ఉండి కూడా సోషల్ సైకోల వల్ల ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ వాళ్లే కాకుండా ఇతర పార్టీ నేతలు సోషల్ సైకోల బాధితులేనని వెల్లడించారు. సోషల్ సైకోలకు శిక్ష పడేలా చట్టాలను సవరించాలని గౌతు శిరీష స్పీకర్ అయ్యన్న పాత్రుడికి విన్నవించారు.