TG: ధర్మపురిని దర్శిస్తే యమపురి ఉండదని పురాణాలు చెబుతున్నాయి. జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయం ప్రాంగణంలోనే యమధర్మరాజు ఆలయం ఉంది. ఇక్కడి యమధర్మరాజు విగ్రహం దేశంలోనే అరుదైనదిగా చెబుతుంటారు. భక్తులు ముందుగా యమధర్మరాజును దర్శించుకున్న తర్వాతే శ్రీలక్ష్మీనృసింహ, వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఇక్కడికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు.