కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్‌తో జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా భేటీ అయ్యారు. వీరిరువురు దేశ రాజధాని ఢిల్లీలో సమావేశమయ్యారు. J&Kలో స్థానిక ఆదాయ ఉత్పత్తిని పెంచడంపై, పెట్టుబడులను ఆకర్షించే మార్గాలు, ఉపాధి కల్పనపై వారు చర్చించారు. ఆరేళ్ల కేంద్ర పాలన తర్వాత అధికార నేషనల్ కాన్ఫరెన్స్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రారంభ బడ్జెట్ సమర్పణకు ముందు ఈ సమావేశం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది.