త్వరలో ఐటీ పాలసీ ప్రకటన చేస్తామని ఎంపీ భరత్ తెలిపారు. టాటాగ్రూప్ ఏపీలో పెట్టుబడులు పెట్టబోతోందని స్పష్టం చేశారు. 20 వరకు హోటల్స్‌ను ప్రారంభించనున్నామని భరత్ తెలిపారు. విశాఖపట్నంలో 10 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. రుషికొండ ప్యాలస్‌లపై ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఎంపీ భరత్ పేర్కొన్నారు.