AP: రాష్ట్ర ప్రభుత్వం IIT మద్రాసుతో కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. మంత్రి లోకేశ్ సమక్షంలో 8 విభాగాల్లో అగ్రిమెంట్ చేసుకున్నారు. అమరావతిలో అంతర్జాతీయ డీప్‌టెక్ పరిశోధన, డిజైన్, ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ పార్క్ ఏర్పాటులో సాంకేతిక సలహాకు APCRDA ఒప్పందం చేసుకుంది. సముద్ర పరిశోధన, కమ్యూనికేషన్, కోస్టల్ ఎనర్జీ హార్వెస్టింగ్ టెక్నాలజీకి IITM, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం జరిగింది.