MNCL: సింగరేణి బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 18 నుంచి సంతకాల సేకరణ చేయనున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి సంకే రవి తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ సర్కార్ మూడవసారి అధికారంలోకి వచ్చిన వెంటనే సింగరేణిని నిర్వీర్యం చేయాలని కుట్రలు చేస్తోందని ఆరోపించారు.