TG: రాష్ట్ర సమాజాన్ని అవమానించేలా సీఎం రేవంత్ రెడ్డి మాటలున్నాయని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు చాలా మర్యాదగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. మహారాష్ట్రలో రేవంత్ ఏ మొహం పెట్టుకుని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. కేసీఆర్ బాటలోనే.. రేవంత్ రెడ్డి కూడా నడుస్తున్నారని విమర్శించారు.