పాకిస్థాన్లో గాలి నాణ్యత అత్యంత తీవ్రస్థాయికి చేరింది. ఈ నెలలో అక్కడ భారీగా వాయు కాలుష్యం పెరిగింది. లాహోర్లో గాలి నాణ్యత సూచి దాదాపు 1600లకు చేరువైంది. దీంతో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్కూళ్లు, పాఠశాలలు, మ్యూజియంలను అధికారులు ఈ వారాంతం వరకు మూసేశారు. ప్రజలు మాస్కులు ధరించాలని, ఆఫీసుల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గించుకోవాలని సూచించారు. ప్రపంచంలోనే పాకిస్థాన్లో గాలి నాణ్యత అత్యంత చెత్తగా నమోదైంది.