TG: రైతులను BRS నేతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని, ఆర్థిక కష్టాలు ఉన్నా.. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని పేర్కొన్నారు. రైతులకు హామీ ఇచ్చిన ప్రకారం సన్నధాన్యానికి బోనస్ ఇస్తామన్నారు. రైతుల కష్టాలపై BRS నేతలు మొసలికన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతులకు మేలు చేసేందుకు ఏదైనా సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.