కార్తీక మాసంలో చాలామంది దీపారాధన చేస్తారు. ఎంతో విశిష్టత గల ఈ మాసంలో దీపం, దానం, జపం వంటివి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. శివుడు, విష్ణు దేవాలయాల్లో దీపాలు వెలిగించటం వల్ల ఆర్థిక కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఆలయాల్లో దీపాలు వెలిగించేవారు తప్పనిసరిగా మూడు చోట్ల దీపాలు పెట్టాలి. గోపుర ద్వారం, నందీశ్వరుడు, గర్భగుడిలో ఈశ్వరుడి వద్ద దీపాన్ని పెడితే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.