NLR: ఆత్మకూరు – వింజమూరు మార్గమధ్యంలో ఉండే రోడ్డు పరిస్థితి దారుణంగా తయారైంది. రోడ్డు సమస్యతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల అక్కడక్కడ కొన్ని చోట్ల తారు పోసి మామా అనిపించినా.. ఇటీవల కురిసిన వర్షాలకు అవి పూర్తిగా మళ్లీ గుంతలుగా మారాయి. వాహనదారులు తరచూ ఈ గుంతలలో పడి ప్రమాదాలకు గురి అవుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించాలని కోరుతున్నారు.