AP: సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా నిల్చేందుకు YCP ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అక్రమ నిర్బంధాలు, అరెస్టులకు గురవుతున్న కార్యకర్తలకు అండగా ఉండేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ ఆదేశాల మేరకు పార్టీ తరపున ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సోషల్ మీడియా కార్యకర్తలకు న్యాయ సహాయం కల్పించడంతో పాటు, వారికి భరోసా ఇవ్వడం కోసం ఈ బృందాలు పనిచేస్తాయి.