AP: సీఎం చంద్రబాబుకు సీపీఐ నేత రామకృష్ణ లేఖ రాశారు. ఉన్నత విద్యామండలి ఛైర్మన్, వర్సిటీలకు వీసీలను తక్షణమే నియమించాలని లేఖలో పేర్కొన్నారు. యూనివర్సిటీల్లో పోస్టుల భర్తీకి వైసీపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసినా.. భర్తీ చేయటంలో విఫలమైందని అన్నారు. కూటమి ప్రభుత్వం వెంటనే వర్సిటీల్లోని ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.