TG: డిసెంబర్9 వరకు ప్రాజాపాలన విజయోత్సవాలపై చేపట్టే కార్యక్రమాలను సీఎంకు అధికారులు వివరించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. విజయోత్సవాల్లో భాగంగా వరంగల్, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాల్లో ఏర్పాటు చేసే బహిరంగ సభల్లో సీఎం పాల్గొననున్నారు. ఈ నెల 19న వరంగల్ వేదికగా సీఎం 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు.