TG: భూదాన్ భూముల రక్షణలో అధికారుల తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. భూదాన్ భూములకు వారసత్వ ధ్రువీకరణపత్రం ఇవ్వడంపై సీరియస్ అయింది. వివాదాన్ని పట్టించుకోకుండా పాస్బుక్ జారీ పట్ల విస్మయం వ్యక్తం చేసింది. నాగారంలో 10.29 ఎకరాలకు సంబంధించిన పిటిషన్పై విచారణ జరిపింది. కౌంటర్ దాఖలు చేయాలంటూ భూదాన్ యజ్ఞ బోర్డు, అప్పటి కలెక్టర్ అమోయ్ కుమార్కు నోటీసులు పంపారు. విచారణను 28వ తేదీకి వాయిదా వేసింది.