AP: ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకుల వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొన్నారు. జూనియర్ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం పెంపునకు పలు సూచనలు చేశారు. సబ్జెక్టుల వారీగా తీసుకోవాల్సిన ప్రాధాన్యత అంశాలపై సలహాలు ఇచ్చారు. పోటీ పరీక్షల్లో ర్యాంకుల సాధనకు తోడ్పాటు అందిస్తామని పేర్కొన్నారు.