NZB: ఉపాధ్యాయుల వైద్య ఖర్చులు పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతూ పీఆర్టీయు తెలంగాణ అధ్యక్షుడు అంబీర్ మనోహర్ రావు జిల్లా విద్యాశాఖ అధికారి రాజుకు వినతి పత్రం అందజేశారు. చాలా రోజులుగా వైద్య ఖర్చుల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారులు చొరవ తీసుకొని బిల్లులు మంజూరు చేయాలని పేర్కొన్నారు.