నేటి బాలలే రేపటి పౌరులు. ఈ ఒక్క వాక్యం చాలు పిల్లలకు ఎంతటి స్వేచ్ఛ, విలువ ఇవ్వాలో అర్థం చేసుకోవడానికి. కానీ ఇప్పటి పిల్లలు తరగతి గదులు, పుస్తకాలు, స్మార్ట్ ఫోన్లకే పరిమితమవుతున్నారు. ఓ పాతికేళ్ల క్రితం బాల్యాన్ని తలచుకుంటే మనకి ఎన్నెన్నో మధురమైన జ్ఞాపకాలు. నానమ్మ చెప్పే కథలు, నాన్న భుజాన షికార్లు! ఏడాదికోసారి అమ్మమ్మ వాళ్లింట్లో దొరికే విలాసం. కానీ ఇప్పటి పిల్లలకు తల్లిదండ్రులే సమయం ఇవ్వడం లేదు. ఈ విషయంలో మార్పు రావాలి.