TG: ఫార్ములా వన్ ఈ రేసు కేసులో మాజీమంత్రి కేటీఆర్ అరెస్టుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రూ.55 కోట్లు విదేశీ సంస్థకు మళ్లించిన వ్యవహారంలో కేటీఆర్ తప్పు చేశారని ఏసీబీ ఆరోపించింది. ఆయనపై విచారణకు అనుమతి కావాలని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు విజ్ఞప్తి చేసింది. అయితే, పర్మిషన్ ఇంకా రాలేదని ప్రభుత్వం ప్రకటించింది. అనుమతి రాగానే కేటీర్ను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.