TG: నిబంధనలకు విరుద్ధంగా మెడిసిన్ ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. నాసిరకం, నకిలీ మెడిసిన్ తయారు చేసే వారిపై, వాటిని అమ్మే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులను ఆదేశించారు. మెడికల్ హాల్స్, ఫార్మసీలలో మరింత విస్తృతంగా తనిఖీలు చేయాలని సూచించారు. ఫార్మా సంస్థలు ఉన్నచోట అదనంగా డ్రగ్ ఇన్స్పెక్టర్లను నియమించాలన్నారు.