విశాఖ: ర్యాంకు సాధించి కన్వీనర్ కోటాలో సీట్లు రానివారికి బీఈడీ స్పాట్ అడ్మిషన్ నిర్వహించాలని విశాఖ జిల్లా AISF జిల్లా కార్యదర్శి యూ. నాగరాజు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఏయూ వీసీని శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు. బీఈడీ అడ్మిషన్ కోసం రెండవ కౌన్సెలింగ్ నిర్వహించి నెల రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు స్మార్ట్ అడ్మిషన్స్ జరగలేదన్నారు.