SRPT: 50శాతం ఫిట్మెంట్తో ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీని అమలు చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు చిలుక శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం తుంగతుర్తి మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న బిల్లులన్నింటినీ మంజూరు చేయాలని, జీవో.నెం.317పై నియమించిన క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలన్నారు.