అల్లూరి: అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం శుక్రవారం పెదబయలు ఏపీఆర్, ఏకలవ్య పాఠశాల, కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పాఠశాలల్లో రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆహారం అందించడంలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఉపాధ్యాయులను హెచ్చరించారు.