VSP: వారానికి ఒక్కరోజు డ్రై డే పాటించాలని విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సూచించారు. కంచరపాలెం ఓల్డ్ ఐటీఐ ప్రాంతంలో శుక్రవారం నిర్వహించిన డ్రై డే కార్యక్రమాన్ని కలెక్టర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దోమలు విజృంబించకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ఇళ్లల్లోనూ పరిసర ప్రాంతాల్లోనూ నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు.