AP: ముంబై నటి జత్వానీ కేసులో విద్యాసాగర్ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ముందస్తు బెయిల్‌పై వైసీపీ నేత విద్యాసాగర్‌రావు పిటిషన్ దాఖలు చేశారు. జత్వానీ ఇంప్లీడ్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేశారు. తదుపరి విచారణను ఈనెల 11వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. తమ కుటుంబంపై అక్రమంగా కేసులు పెట్టి వేధించారని విద్యాసాగర్‌తో పాటు పలువురు పోలీసు అధికారులపై నటి కేసు పెట్టిన సంగతి తెలిసిందే.