VZM: బొబ్బిలి తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా జిల్లా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు వేమిరెడ్డి లక్షుంనాయుడు మాట్లాడుతూ.. ప్రస్తుతం వ్యవసాయ రంగం తీవ్రమైన సంక్షోబంలో ఉందన్నారు. కూలీలు దొరకక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఉపాధి హామీ పధకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలన్నారు.