TG: యాదాద్రి ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ సమీక్ష ముగిసింది. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఉండాలని అధికారులకు సూచించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మార్పు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. పెండింగ్ పనులకు తొందరగా పూర్తి చేయాలని సూచించారు. కాగా రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా స్వామి వారిని కుటుంబ సభ్యులతో దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.