ఇటీవల ‘అమరన్’ సినిమాతో మంచి విజయం అందుకున్న దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి మరో సినిమా తీసేందుకు సిద్ధమయ్యారు. తమిళ హీరో ధనుష్‌తో ఓ సినిమాను తెరకెక్కించనున్నారు. ‘D55’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందనున్న ఈ సినిమా పూజా కార్యక్రమం చెన్నైలో జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.