ELR: విద్యార్థుల అపార్ వివరాల నమోదును వేగవంతం చేయాలని డీఈవో వెంకట లక్ష్మమ్మ తెలిపారు. కలిదిండి మండలం కోరుకొల్లు, ఆవకూరు ప్రభుత్వ పాఠశాలల్లో గురువారం అపార్ నమోదు ప్రక్రియను డీఈవో పరిశీలించారు. కొన్ని పాఠశాలల్లో నమోదు శాతం చాలా తక్కువగా ఉందన్నారు. అలాంటి బడులపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.