మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయా రాష్ట్రాల్లో భారీగా నగదు పట్టుబడింది. నవంబర్ 6 వరకు పూర్తిగా రూ. 558.67 కోట్లు విలువైన నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, బంగారం, ఉచిత వస్తువులు ఇతర తాయిలాలను సీజ్ చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.