TG: నిజామాబాద్ జిల్లా భీం గల్ లోని లింబాద్రి గుట్టపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు లక్ష్మీనరసింహ స్వామి, అమ్మవార్లకు ఘనంగా పూజలు నిర్వహించి, ఊరేగింపుగా తీసుకెళ్లి కొండపైకి చేర్చారు. ఈ ఉత్సవాల్లో భక్తులు భారీగా హాజరయ్యారు.