కృష్ణా: వరద బాధితులను ఆదుకునేందుకు ONGC స్వచ్ఛందంగా ముందుకు రావడం ఎంతో అభినందనీయమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. గురువారం ONGC ప్రతినిధులు జిల్లా కలెక్టర్ని వారి చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి రూ.11,78,300ల విలువచేసే వరదల సమయంలో ఉపయోగపడే లైఫ్ జాకెట్లు, సిగ్నల్ లైట్లు, డ్రాగన్ లైట్లు,రంపాలు తదితర వస్తువులను అందజేశారు.