AP: సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులపై ‘X’లో టీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాను కొందరు సైకోలు, సైకో పార్టీలు కలిసి భ్రష్టు పట్టించాయని మండిపడ్డారు. మానవ సంబంధాలను మరిచి మృగాళ్లా మారారని.. ప్రశ్నించే మహిళలపై అసభ్యకర పోస్టులతో రాక్షస ఆనందం పొందుతున్నారన్నారు. తాను YSRకే పుట్టలేదని అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సైకోలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.