TG: మానవ అక్రమ రవాణా కేసులో నాంపల్లి NIA ప్రత్యేక కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ నుంచి ఉద్యోగాల పేరిట మహిళలను తీసుకొచ్చి బలవంతంగా వ్యభిచారంలోకి దింపిన ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు విధించింది. 2019లో పాతబస్తీ ఛత్రినాక ఠాణాలో నమోదైన కేసు ఆధారంగా దర్యాప్తు చేపట్టి.. నిందితులు యూసఫ్ ఖాన్ అతని భార్య బీతి బేగం, సోజిబ్, రాహులు, అబ్దుల్ సలాం, షీలాలకు జీవిత ఖైదు విధించింది.