AP: గ్రామీణ స్థాయి నుంచి క్రికెట్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. మంగళగిరి అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో ఏసీఏ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. క్రికెట్ అకాడమీలను నిర్మిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచ మౌలిక స్థాయి వసతుల కల్పనపై చర్చించామని తెలిపారు. విశాఖ, మంగళగిరి క్రికెట్ మైదానాల్లో మార్పులు చేయబోతున్నామని పేర్కొన్నారు. దీనికి సంబంధించి 35 ఎకరాలు కావాలని CRDAకు లేఖ రాశామని వెల్లడించారు.